Thursday, April 25, 2024

కాంగ్రెస్​ పొలిటికల్​ స్ట్రాటజిస్ట్​గా పీకే ఓల్డ్​ ఫ్రెండ్​.. సునీల్​ కానుగోలుతో ఒప్పందం చేసుకున్న రాహుల్​​

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌తో కలిసి పని చేయడం ఇక సాధ్యం కాదని తెలిసిపోయింది. దీంతో అతని మాజీ సహచరుడు ఇప్పుడు కాంగ్రెస్​ పార్టీతో కలిసి పనిచేయడానికి సైన్ అప్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర ఎన్నికలతో పాటు 2023 నుంచి కాంగ్రెస్ ప్రచారాన్ని ప్లాన్ చేసే బాధ్యతను సునీల్ కానుగోలుకు అప్పగించినట్టు తెలుస్తోంది. 2024 జాతీయ ఎన్నికల విషయానికొస్తే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ సీనియర్ లీడర్​ ఒకరు మీడియాతో చెప్పారు. నరేంద్ర మోడీ బ్లాక్‌బస్టర్ 2014 ప్రచారాన్ని నిర్వహించిన బృందంలో ప్రశాంత్ కిషోర్‌తో పాటు భాగమైన కానుగోలు, కాంగ్రెస్​ అధినేతలతో జరిగిన భేటీ తర్వాత ఈ కొత్త అసైన్‌మెంట్‌ను స్వీకరించినట్టు సమాచారం.  కాగా, కిషోర్ సహచరుడిగా కానుగోలు గతంలో బీజేపీ, డీఎంకే, ఏఐఏడీఎంకే, అకాలీదళ్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది.

గత ఏడాది ఏప్రిల్-మేలో బెంగాల్ ఎన్నికల విజయం తర్వాత ప్రశాంత్​  కిషోర్​.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పూర్తి-సమయ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలన్న చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అనేక మార్లు భేటీ అయిన తర్వాత PKతో చర్చలు ఫల ప్రదం కాలేదు. దీంతో తమిళనాడు ఎన్నికలప్పుడు అన్నాడీఎంకేతో కలిసి పనిచేసిన సునిల్​ కానుగోలును కాంగ్రెస్ సంప్రదించింది.. 2024 ఎన్నికల వ్యూహానికి అతనికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement