Saturday, April 27, 2024

దేశానికి కొత్త దిశానిర్దేశం కావాలి : కేసీఆర్

కేంద్ర ప్ర‌భుత్వం స‌రైన దిశ‌లో న‌డ‌వ‌డం లేదు.. దాన్ని స‌రిచేయాల్సిన బాధ్య‌త ప్ర‌తి పౌరుడిపై ఉందని, దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో స‌మావేశం అనంత‌రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… భార‌త్‌ను స‌రైన దిశ‌లో తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధముంద‌న్నారు. తెలంగాణ ఉద్య‌మానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మ‌ద్ద‌తు ప‌లికారన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు స‌హ‌క‌రించారని, ఇవాళ శిబూ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌టం ప‌ట్ల ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారని కేసీఆర్ తెలిపారు. కొత్త దిశానిర్దేశం కోసం ప‌లువురి నేత‌ల్ని క‌ల‌వ‌డం జ‌రుగుతోందన్నారు. కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని న‌డిపేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని కేసీఆర్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement