Friday, May 17, 2024

న‌గ్నంగా నిర‌స‌న తెలిపిన – ఇరాన్ న‌టి

ఇరాన్ దేశంలో మ‌స్సా అమినే అనే యువ‌తి టెహ్రాన్ న‌గ‌రంలో వున్న మెట్రో స్టేష‌న్ లో హిజాబ్ సరిగా వేసుకోలేదని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆమెను వారు హింసించడంతో ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది.దీంతో ఆ దేశపు మహిళల్లో ఆగ్రహజ్వాల రగిలింది.చాలా చోట్ల ర్యాలీలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. కొంతమంది హిజాబ్ తీసేసి, జుట్లు కూడా కత్తిరించుకొని నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా అక్కడి నటి ఎల్నాజ్ నౌరోబి కూడా ఒక చిన్న నిరసన తెలిపారు.ఇది ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.ఈ నిరసన కార్యక్రమం లో భాగంగా ఆమె కెమెరా ముందు తన దుస్తులు మొత్తం ఒక్కొక్కటి గా తేసివేస్తూ పూర్తి నగ్నంగా నిలబడింది. తన చేతులతో ఎద భాగం దాచుకొని ప్రపంచంలో స్త్రీ కి ఏరకమైన దుస్తులు అయినా ధరించే స్వేచ్చ వుందని, ప్రతి ఒక్కరికి స్వేచ్చ గా వుండే హక్కు వుందని , ప్రతి ఒక్కరికి ఒక్కొరకమైన అభిప్రాయం వుంటుంది అని అందరూ దానిని గౌరవించాలి అని చెప్పింది. తన శరీరాన్ని ఎలాంటి దుస్తులతో కప్పుకోవాలి అనేది మహిళల ఇష్ట పూర్తిగా వుండాలని, నేను నగ్నత్వం చూపడం లేదని, స్వేచ్చ కోసం మాత్రమే నిలబడ్డాను అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియో ప్రపంచంలో వైరల్ గా మారి సంచలనం సృష్టించింది. వీడియోను లక్షల మంది లైక్ చేసారు. అలాగే మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు.

https://www.instagram.com/reel/CjkEF9vpGVq/?utm_source=ig_embed&ig_rid=541975c4-6b1e-4c65-86b2-55646754d680
Advertisement

తాజా వార్తలు

Advertisement