Thursday, May 2, 2024

Breaking: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నంలో అల్లు అర్జున్‌.. కూతురు అర్హ‌తో క‌లిసి మాస్ స్టెప్పులు!

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌లో గణేష్‌ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆగస్ట్ 31న వినాయక చవితి నాడు ఆఫీస్‌లో గణపతిని ప్ర‌తిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరు రోజుల పాటు అల్లు అర్జున్‌తోపాటు అతని ఆఫీస్‌లోని స్టాఫ్‌ అంతా ఘనంగా పూజలు చేశారు. కాగా, ఇవ్వాల (సోమవారం) ఆ గణేషున్ని నిమజ్జనం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. స్టాఫ్‌తోపాటు తన కుటుంబం కూడా వెంట రాగా ఊరేగింపుగా వెళ్లి గణపతిని నిమజ్జనం చేయడం విశేషం. ఊరేగింపు సందర్భంగా రోడ్డుపై గణపతి ముందు అర్జున్‌ స్టెప్పులేశారు. అతన్ని చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

పూర్తి బ్లాక్‌ డ్రెస్‌లో అర్జున్‌ ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. త‌న కూతురు అర్హను ఎత్తుకొని మరీ అతడు డ్యాన్స్ చేయ‌డం అంద‌రినీ అల‌రించింది. ఇక ఈ గణేష్‌ చతుర్థికి ముందు అతని మూవీ పుష్ప స్టైల్లో కొన్ని విగ్రహాలు వెలిసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రతోపాటు ఢిల్లీలాంటి నగరాల్లో పుష్ప స్టైల్‌ గణేష్‌ విగ్రహాల ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ అల్లువారబ్బాయి పుష్ప 2 షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement