Thursday, May 2, 2024

Telangana: అన్ని ఆఫీసులు ఒక్క ద‌గ్గ‌ర్నే.. స‌మీకృత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాల‌ను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ‌లో కొత్త ఆఫీసుల ప్రారంభోత్స‌వ పండుగ జ‌రుగుతోంది. ఇప్ప‌టిదాకా ఎక్క‌డో విసిరేసిన‌ట్టున్న ఆఫీసుల‌న్నీ ఒకే ద‌గ్గ‌ర నిర్మిత‌మ‌య్యాయి. ప్ర‌జ‌ల‌కు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఒక్క ద‌గ్గ‌ర‌నే అన్ని ప‌నులు చ‌క్క‌బెట్టుకునేలా సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఇట్లాంటి అద్భుత క‌ట్ట‌డాలు నిర్మించారు. ఇక ఇప్ప‌టికే వికారాబాద్​, మేడ్చ‌ల్ జిల్లాల క‌లెక్ట‌రేట్‌లన్​ ప్రారంభించి ఆయా జిల్లా క‌లెక్ట‌ర్‌లను స్వ‌యంగా సీటులో కూర్చోబెట్టిన సీఎం కేసీఆర్‌.. నిర్మాణం పూర్తిచేసుకున్న‌ మ‌రో రెండు కొత్త స‌మీకృత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాల‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఇక.. నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో భాగంగా.. ఆగస్టు 25న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, 29వ తేదీన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, ఆ త‌ర్వాత సెప్టెంబర్ 10వ తేదీన జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వేగ‌వంతంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement