Sunday, April 28, 2024

ప్ర‌జా ఉద్య‌మ త‌ర‌హాలో ‘భార‌త గ‌ర్జ‌న‌’..

ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌తో సహా ముగ్గురు ముఖ్యమంత్రులు రాక
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి కూడా
భారాస అజెండా, విధివిధానాలు ప్రకటించే అవకాశం
జాతీయ రాజకీయాలకు వేదికగా ఖమ్మం సభ చారిత్రాత్మకం

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌), భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)గా అవతరించిన తర్వాత తొలి సభకు సమయం ఆసన్నమైంది. బుధవారం నిర్వహించే బీఆర్‌ఎస్‌ భారీ ఆవిర్భావ సభకు ఖమ్మం వేదిక కానుంది. కేంద్రంపై పోరాటానికి సమర భేరి మోగిస్తూనే ఈ ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లి ఎన్నికలకు ఈ సభ వేదికనుంచి కేసీఆర్‌ శంఖారావం పూరించనున్నారు. జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ విధివిధానాలను సభ నుంచి కేసీఆర్‌ ప్రకటించనున్నారు. సభకు 5 లక్షల మందికి తక్కువ కాకుండా జన సమీకరణ చేయనున్నారు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఆవిర్భావంతో దేశ రాజకీయా ల్లో ఓ కొత్త చర్చకు, వ్యవసాయరంగ అభివృద్ధి, రైతు సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన పార్టీ ఉనికి దేశం నలుమూలలకు చాటేలా భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఉద్యమ స్పూర్తికి కేంద్ర బిందువైన ఖమ్మం కేంద్రంగా ‘భారత గర్జన’ పేరుతో ఈ నెల 18న (బుధవారం) జరుగనున్న ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో వేళ్ళూ నుకుపోయిన ప్రధాన రాజకీయ పార్టీల దిమ్మ దిరిగేలా పదునైన వ్యూహరచనతో సిద్ధం చేసిన బీఆర్‌ఎస్‌ అజెండాను ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉంది. 2001లో టీ-ఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత కరీంనగర్‌లో నిర్వహించిన ‘సింహగర్జన’ సభను తలదన్నేలా ఖమ్మంలో ‘భారత గర్జన’తో సత్తాను చాటేందుకు భారీ జన సమీకరణ చేస్తున్నారు. నాడు తెలంగాణ వెనుక బాటుతనాన్ని ఎత్తిచూపి ఉవ్వెత్తున ప్రజా ఉద్యమా నికి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌, అదే పంథాతో నేడు దేశ ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా మరో ప్రజా ఉద్యమానికి నాంది పలుకబోతున్నారు.

బీఆర్‌ఎస్‌ జెండా, అజెండాతో సాగే తన ప్రసం గాన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా వీక్షించేలా ఇతర రాష్ట్రాల్లోని పలు వార్తా ఛానెళ్ళ ద్వారా విస్తృత ప్రచారం చేయబోతున్నారు. అదేరోజు పలు రాష్ట్రాల్లో పదవీ విరమణ పొందిన ఉన్నతాధికారు లంతా పెద్దఎత్తున పార్టీలో చేరేలా ఆహ్వానం పలికారు. ఖమ్మం గడ్డపై నిర్వహించ తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్‌ కేడర్‌ మొత్తం గడిచిన వారం, పది రోజులుగా జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లా పది నియోజకవర్గాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అభిమానులు, నాయకులు, దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్య నాయ కులు హాజరు కానున్నారు. అందుకోసం భారీ జనసమీ కరణ లక్ష్యంగా ఏర్పాట్లు- చేస్తున్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లకు మంత్రి హరీశ్‌ రావు నేతృత్వం వహిస్తు న్నారు. బహిరంగ సభ ఇన్‌ఛార్జిలుగా మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావులకు సీఎం కేసీఆర్‌ బాధ్యతలు అప్పగించారు. సభా వేదిక ఇన్‌ఛా ర్జిగా టీ-ఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లుకు బాధ్య తలు అప్పజెప్పారు.

- Advertisement -

అతిధుల కోసం 2 ప్రత్యేక హెలికాప్టర్లు
భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు- ముఖ్య అతిథులుగా ఢిల్లీ, పంజాబ్‌, కేరళ ముఖ్యమం త్రులు కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, పినరయి విజయన్‌తో పాటు- ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా హాజరు కానున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇతర నేతల కోసం ప్రత్యేకంగా 2 హెలికాప్టర్లను బీఆర్‌ఎస్‌ ఏర్పాటు- చేస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు 17న రాత్రికే హైదరాబాద్‌ చేరుకుంటారు. 18న ఉదయం కేసీఆర్‌తోపాటు- ముఖ్య మంత్రులు, పలువురు నేతలు రెండు హెలికాప్టర్లలో యాదాద్రికి వెళ్లనున్నారు. అక్కడ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించు కుంటారు. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా తొలి బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

భారత గర్జన రోజే ఖమ్మంకు ముఖ్యనేతలు
అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం సమయంలో హెలికాప్టర్లలో ఖమ్మం చేరుకుంటారు. 18న ఉదయం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం రానున్నారు. అనంతరం అందరూ కలిసి కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అక్కడే ఖమ్మం జిల్లాకు నూతనంగా కేటాయించిన వైద్యకళాశాల నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం కలెక్టరేట్‌ను పరిశీలిస్తారు. తర్వాత రెండోదశ కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. అనంతరం నూతన కలెక్టరేట్‌ కార్యాలయంలోనే ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యనేతలు భోజనం చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ముగ్గురు సీఎంలు, యూపీ మాజీ సీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ఒకేసారి వేదికపైకి చేరుకుంటారు. ముఖ్య నేతల ప్రసంగం తర్వాత చివరగా సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. జాతీయ రాజకీయాలపై మాట్లాడటంతో పాటు- బీఆర్‌ఎస్‌ ఉద్దేశం, లక్ష్యాలు వివరిస్తారు.

భారీ జన సమీకరణే లక్ష్యం
ఈ బహిరంగ సభకు మొత్తం 5 లక్షల మందిని సమీకరించాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు- చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజక వర్గాల నుంచి మొత్తం 3 లక్షల మందిని తరలించేలా ఏర్పాట్లు- చేస్తున్నారు. ఖమ్మం నగరానికి చుట్టు-పక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి 30నుంచి 40 వేల మంది, జిల్లా సరిహద్దుల్లో ఉన్న నియో జకవర్గాల నుంచి 20 వేల మంది చొప్పున తరలిం చేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్‌ జిల్లాల నుంచి రెండు లక్షల మందిని తరలించేందుకు కసరత్తు చేస్తున్నారు.ఇందుకోసం నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్‌ సభా సన్నాహాలు ప్రారంభించారు. 70 ఎకరాల విస్తీర్ణంలో సభాస్థలిని చదును చేసే ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. సభకు హాజరయ్యే వారికి ముందు వరుసలో సుమారు లక్ష కుర్చీలు వేసేలా ప్రణాళికలు చేస్తు న్నారు. బహిరంగ సభకు కనివీనీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు- చేస్తున్నట్లు- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా సభా వేదికకు కిలోమీటరు దూరం లోపలే పార్కింగ్‌ ఏర్పాటు- చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement