Thursday, May 2, 2024

త‌మిళంలో అఖండ – ఈ నెల 28న రిలీజ్

గ‌త ఏడాది డిసెంబ‌ర్ 2న విడుద‌ల‌యింది అఖండ చిత్రం. ఈ చిత్రం అఖండ‌విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను తెర‌కెక్కించాడు. నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ని పోషించారు. బాలయ్య కెరీర్లోనే అత్యంత భారీ వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచి సరికొత్త రికార్డుని నెలకొల్పింది. బాలయ్య తొలిసారి అఘోరా పాత్రలో నటించిన తీరు ప్రీ క్లైమాక్స్ సన్ని వేశాల్లో శితాండవం చేస్తూ ఉగ్రరూపం దాల్చినట్టుగా బాలయ్యని చూపించిన తీరు ప్రేక్షకులతో పాటు ఆయన అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. జనవరి 21న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు.

రికార్డు స్థాయిలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆకట్టుకుంటున్న ఈ చిత్రానికి ఇతర బాషల్లోనూ డిమాండ్ పెరగడంతో తమిళంలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జనవరి 28న శుక్రవారం , అఖండ తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైలెంట్ గా డబ్బింగ్ కార్యక్నమాలు పూర్తి చేసి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. భారీ స్థాయిలో ఈ మూవీ తమిళ వెర్షన్ థియేటర్లలో సందడి చేయబోతోంది. ప్రస్తుతం తమిళంలో రిలీజ్ కి ఏ సినిమాలు లేకపోవడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన తమిళనాడు థియేటర్ వర్గాలు అఖండ తమిళ వెర్షన్ కోసం భారీ స్థాయిలో థియేటర్లని కేటాయించారట. దీంతో అక్కడ బాలయ్య గర్జనకు అంతా రెడీ అయిపోయింది. తెలుగులో సంచలనాలు సృష్టించిన అఖండ తమిళంలోనూ అదే రాంపేజ్ ని కంటిన్యూ చేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది. పైగా హిందూత్వ పై ప్రధానంగా సాగిన కథ కథనాలు ఈ సినిమాని ప్రతీ భాషలోనూ బ్లాక్ బస్టర్ గా నిలవ‌డం కాయమని ట్రేడ్ పండితులు వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement