Friday, April 26, 2024

క్వీన్ నందినిగా ఐశ్వ‌ర్యారాయ్ – పొన్నియిన్ సెల్వ‌న్ ఫ‌స్ట్ లుక్

స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ మూవీ పొన్నియిన్ సెల్వ‌న్..ఈ మూవీ రెంబు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. ఈ మూవీలోని ఫస్ట్ పార్ట్ ని PS – 1 గా సెప్టెంబర్ 30న పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. చియాన్ విక్రమ్ తో పాటు కీలక తారాగణం మొత్తం ఈ చిత్రంలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ రిలీజ్ మరో రెండు నెలలు వుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది.ఈ చిత్రంలోని ఐశ్వర్యారాయ్ లుక్ ని విడుదల చేశారు.

ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తోంది. అందులో ఓ పాత్రలో పళువూర్ క్వీన్ నందినిగానూ కనిపించబోతోంది. మేకర్స్ ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. యువరాణి నందినిగా ఐశ్వర్యారాయ్ ఈ మూవీలో కనిపించబోతోంది. ప్రతీకారానికి అందమైన ముఖం..ఇదుగో పజువూరు రాణి నందిని అంటూ మేకర్స్ ఈ పాత్రని పరిచయం చేశారు. ఐశ్వర్య అందంగా కనిపిస్తున్నా.. ప్రతీకారం కోసం రగిలిపోయే మహారాణిగా ఆమె పాత్ర ఇందులో చాలా ప్రత్యేకంగా వుంటుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. రాజసం ఉట్టిపడేలా ఆభరణాలతో ముగ్ధమనోహరమైన రూపంతో.. తీక్షణమైన చూపులతో కనిపిస్తున్న ఐశ్వర్య లుక్ ఆకట్టుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్ ముందుకు రావడంతో వారితో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్ పై చోళ ఎంపైర్ నేపథ్యంలో పొన్నియన్ సెల్వన్ మూవీని రెండు భాగాలుగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement