Monday, April 29, 2024

Air Force: దుబాయ్‌లో ఎయిర్ షో.. అద‌ర‌గొట్టిన ఐఏఎఫ్ జెట్‌లు..

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన సూర్య‌కిర‌ణ్‌ ఎరోబాటిక్స్ టీమ్ అండ్ యూఏఈకి చెందిన అల్ ఫుర్సాన్ డిస్‌ప్లే టీమ్ ఆధ్వ‌ర్యంలో దుబాయ్‌లో నిన్న నిర్వ‌హించిన ఎయిర్ షో అద్భుతంగా సాగింది. ఈ ఎయిర్ షోలో ఆకాశ‌మార్గాన జెట్ లు దూసుకెళ్తున్న దృశ్యాల‌ను చూప‌రుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి.

సూర్య‌కిర‌ణ్ టీమ్‌కు చెందిన 9 హాక్‌ 132, బుర్జ్ ఖ‌లీఫా, పామ్‌జుమేరా, బుర్జ్ అల్ అర‌బ్ వంటి దుబాయ్‌లోని ప్ర‌ధాన ల్యాండ్‌మార్క్ ల మీదుగా దూసుకెళ్లే దృశ్యాలు అబ్బుర‌ప‌రుస్తున్నాయి. అల్ ఫుర్సాన్‌కు చెందిన ఏడు జెట్‌లు ఎర్మాచ్చి, ఎంబి-339తో క‌లిసి ఎయిర్‌షోలో పాల్గొన్న‌ట్టు ఏఎన్ఐ వార్త సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement