Friday, May 3, 2024

క‌రోనా కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధం – ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా

క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. గ‌తంలో క‌రోనా సెకండ్ వేవ్ లో ముంద‌స్తుగా ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, మెడిసిన్ ని నిల్వ చేశారు. అంతేకాదు బెడ్స్ ని కూడా బుకింగ్ చేసుకున్నారు. కాగా ఈసారి అలాంటివి చేయ‌వ‌ద్ద‌ని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశంలో క‌రోనా కేసులు పెరిగినా ఎదుర్కొవ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. కాగా ఇప్పుడు సోకుతున్న ఒమిక్రాన్ వేరియంట్ స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే ఉంటాయ‌ని చెప్పారు. అందువ‌ల్ల ఆక్సిజ‌న్ సపోర్ట్ అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తెలిపారు. కాబ‌ట్టి ఎవ‌రూ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, మందుల‌ను నిల్వ చేసుకోకూడ‌ద‌న్నారు.

క‌రోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తొల‌గిపోలేదని ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాలి. అయితే ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కాక‌పోతే అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. రాబోయే 2022 ప్ర‌తీ ఒక్కరికి సంతోషంగా, ఆరోగ్యంగా, సంప‌న్నంగా ఉండాల‌ని ఆంకాంక్షించారు. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్ర‌జ‌లు వ్యాక్సిన్ వేసుకున్నార‌న్నారు. అయితే దేశంలో కేసులు పెరుగుతున్నాయని .. క‌రోనా వ్యాప్తిని నివారించ‌డానికి మాస్క్‌లు ధ‌రించ‌డం, భౌతిక‌దూరం పాటిస్తూ, కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. జ‌నం గుంపులుగా ఉండ‌వ‌ద్ద‌ని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement