Sunday, May 5, 2024

ఆదిపురుష్ ట్రైల‌ర్.. విజువల్ ట్రీట్

స్టార్ హీరో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తోన్న చిత్రం ఆదిపురుష్.ఈ చిత్రంలో సీత‌గా కృతిస‌న‌న్ న‌టించింది. మైథాలజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి తానాజీ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడి పాత్రలో దేవ్ దత్త నగే నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సాచెట్ – పరంపర ఆది పురుష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ ఆది పురుష్ సినిమా జూన్ 16 న ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది కాగా ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర‌ యూనిట్. ఈ ట్రైలర్ మొత్తం 3 నిమిషాల 20 సెకండ్లు ఉంది. సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రాముడి ఆగమనం, అయోధ్య పరిచయం.. ఇలా కొనసాగించి చివరికి రామ, రావణ యుద్ధం షాట్లతో ముగించారు. ఈ ట్రైలర్ లోని విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్ చూసినప్పుడు ఏదైతే నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందో అది పూర్తిగా తొలగిపోయేలా బ్రహ్మాండంగా కట్ చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement