Friday, May 10, 2024

హీరో విశాల్ కు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. రూ.15 కోట్లు కట్టాలని ఆదేశం

త‌మిళ స్టార్ హీరో విశాల్ కు మ‌ద్రాస్ హై కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్‌ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోగా హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును డిపాజిట్ చేయాలని పేర్కొంది. 

కాగా, హీరో విశాల్ పై లైకా సంస్థ మద్రాస్ హైకోర్టను ఆశ్రయించింది. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పుగా తీసుకున్న రూ. 21.29 కోట్లు చెల్లించకుండానే ‘వీరమే వాగై సుడుం’ అనే చిత్రాన్ని విడుదల చేసేందుకు విశాల్ సిద్ధమైయ్యారని ఆరోపించింది. సినిమాను విడుదల చేయడమే కాకుండా శాటిలైట్, ఓటీటీ హక్కులను కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. కాబట్టి సినిమా విడుదల, హక్కుల విక్రయంపై నిషేధం విధించాలని కోరింది. ఈ పిటిషన్ శనివారం విచారణకు వచ్చింది. ఈ కేసు వాదనలు విన్న హైకోర్టు.. విశాల్ రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement