Monday, April 29, 2024

Operation Lotus: బీజేపీ విపరీత పోకడలు.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న ఆప్​ ఎమ్మెల్యేలు!

దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విపరీత పోకడల గురించి తెలియజేయడానికి ఆప్ ఎమ్మెల్యే అతిషి మర్లెనా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అపాయింట్​మెంట్​ కోరారు. “భారత ప్రజాస్వామ్య పరిరక్షకురాలు – గౌరవనీయులైన రాష్ట్రపతి అపాయింట్​మెంట్​ కోరాను” అని అతిషి ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న ‘ఆపరేషన్ కమలం’ గురించి చర్చించేందుకు @AamAadmiParty ఎమ్మెల్యేల బృందం ఆమెను కలవాలనుకుంటోంది” అని ట్వీట్​లో పేర్కొన్నారు. 

వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి సొంతంగా ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీల నుంచి 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆప్ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఢిల్లీ ఎమ్మెల్యేలలో 40 మందిని కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నించారని, కనికరం లేకుండా బీజేపీ దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఎమ్మెల్యే అతిషి అన్నారు.

ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అతీషి పేర్కొన్నారు.‘‘కేంద్రంలో బీజేపీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలను పడగొట్టింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను అస్థిరపరిచింది. ఇతర పార్టీలు.. ప్రజల ఆదేశాన్ని ధిక్కరించి, వారు తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అని అతిషి ట్వీట్​లో తెలిపారు.

అంతకుముందు అతిషితో సహా 10 మంది ఆప్ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను కలవడానికి ప్రయత్నించారు. రాష్ట్రంలోని ఇతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని కోరాలను అనుకున్నారు. కాగా, సీబీఐ ప్రధాన కార్యాలయంలోకి వారిని అనుమతించకపోవడంతో నిరసనగా ఆప్ శాసనసభ్యులు ఆఫీసు ముందు ధర్నాకు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement