Thursday, April 25, 2024

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం నుండి – కొత్త కొత్త‌గా సాంగ్ ప్రోమో

ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రంలో సుధీర్ బాబు, కృతిశెట్టి జంట‌గా న‌టిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ – సుధీర్ బాబు కాంబినేషన్ లో రూపొందిన మూడో సినిమా ఇది. బెంచ్ మార్క్ స్టూడియోస్ – మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి, వివేజ్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘కొత్త కొత్తగా’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను చైత్ర ఆలపించారు. పూర్తి పాటను రేపు విడుదల చేయనున్నారు. సినిమా డైరెక్టర్ గా సుధీర్ బాబు కనిపిస్తుండగా, నటిగా మారిన డాక్టర్ గా కృతి శెట్టి కనిపించనుంది. అవసరాల శ్రీనివాస్ .. వెన్నెల కిశోర్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=ARyOvKtwGmE

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement