Tuesday, March 19, 2024

Spl Story | మట్టిపాత్రలో షుగర్‌ని నయం చేసే అద్భుత టెక్నిక్‌.. పాత తరం వాళ్లు అందుకే హెల్దీగా ఉన్నారా?

గుంటూరు, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి : మట్టి పాత్రలో అంత టెక్నాలజీ ఉందా! షుగర్ కు దీనికి లింకేమిటి నమ్మలేని నిజమిది! మట్టి పాత్రలో ఎప్పుడో మన అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే వాళ్ల అమ్మలు కాలంలో వంట చేసేవారు, అని చెప్పుకొనే రోజులు వచ్చేశాయి. మట్టి పాత్రలో వండు కోవలసిన కర్మ మాకేమిటి అంటున్నారు. అయితే అదంతా మట్టి పాత్రలు గొప్ప తనం తెలియకే? నాన్ స్టిక్ స్టైయన్ లెస్ స్టీలు అల్యూమినియం పాత్రలు వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవు. ఇంక కొంతమంది పెద్దలు మట్టి పాత్రలు ద్వారా ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు! కాబట్టి మనం మట్టి పాత్రలు ద్వారా వంటచేయటం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.

నిజానికి మట్టి పాత్రలో వంటచేస్తే చాలా రుచిగా ఉంటుంది.ఎక్కవ కాలం చెడిపోకుండా నిలువ వుంటాయి. కావాలంటే మీ అమ్మమ్మనో నాయనమ్మనో అడగండి. అసలు మట్టి పాత్రలో ఏముందో చూద్దాం మన ఆరోగ్యానికి కావలసి18 రకాల ‘ మైక్రో న్యూక్లియన్స్ ‘ ఈ మట్టిలో వున్నాయి. మట్టి పాత్రలో ఆహారాన్ని వండటం వలన వచ్చిన రిపోర్టు ఏమిటంటే ఈపధార్ధములో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు. మామూలు పాత్రలో వండిన పదార్థాలలో 7 నుంచి 13 శాతం మాత్రమే మైక్రో న్యూట్రియన్స్ వున్నాయి.

మట్టి పాత్రలో మాత్రము నూరుశాతం మైక్రో న్యూట్రియన్స్ వున్నాయి.ఈ పదార్థాలకి రుచి కూడా అద్బుతంగా వుంటుంది. మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్ కు వేడి తగలగానే ఇన్ప్రారెడ్ కంటికి కనిపించని కిరణాలు అంటే ఇన్విజబుల్ రేస్ ఉత్పత్తి అవుతాయి. ఈ కిరణాలు వెదజల్లిన ప్రాంతమంతా పూర్తిగా శుద్ధి అవుతుంది. ఎవరైనా పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుట్టిన పుట్టుకతోనే పసిరికలు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇంక్యుబేటర్ అనే పరికరంలో కొన్ని గంటలు పాటు వుంచుతారు.ఆ పరికరంలో వుండేలైట్ లైట్ ద్వారా ఇన్ప్రారెడ్ కిరణాలు ద్వారా ప్రసరింపచేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు.

కేవలం కొద్ది గంటల్లో నే పాపకు పూర్తి స్థాయి ఆరోగ్యాన్నిచ్చే శక్తి ఈకిరణాలకే వుంది. మట్టి పాత్రలకి అంత శక్తి టెక్నాలజీ వుందన్నమాట. జీవితాంతం మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరిమీద ఆదారపడకుండా జీవించగలం. ఇది కూడా మట్టి పాత్రలో వంటచేసి తినడం ద్వారానే. చక్కెర వ్యాధి వున్న వారికి ఈ మట్టి పాత్రలు ద్వారా వండిపెడితే కొన్ని నెలలు లోపే డయాబిటీస్ నుండి విముక్తులను చేయండి ఆనందంగా జీవించనీయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement