Monday, April 29, 2024

యువ‌కుడిని చెట్టుకి త‌ల‌కిందులుగా వేలాడదీసి కొట్టారు

ఓ యువ‌కుడిని చెట్టుకి తాళ్ల‌తో కట్టి త‌ల కిందులుగా వేలాడ‌దీసి కొట్టారు కొంద‌రు వ్య‌క్తులు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని ఉచ్ఛ్‌భ‌ట్టీ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అయింది. దీంతో ఐదుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలోని ఒక‌రి ఇంట్లో మొన్న‌ రాత్రి స‌మ‌యంలో చొర‌బ‌డ‌డానికి మ‌హ‌వీర్‌ సూర్య‌వంశీ అనే యువ‌కుడు ప్ర‌య‌త్నించ‌డంతో అత‌డిని ప‌ట్టుకోవ‌డానికి స్థానికులు య‌త్నించారని తెలిసింది. అయితే, సూర్యవంశీ తప్పించుకుని పారిపోవ‌డంతో అత‌డిని నిన్న ఉద‌యం ప‌ట్టుకుని చెట్టుకి త‌ల‌కిందులుగా వేలాడదీసి కొట్టారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. రతన్‌పూర్ ప్రాంతానికి చెందిన బాధితుడు మహావీర్ సూర్యవంశీ ఉచ్చభట్టిలో ఉంటూ కూలీ, వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement