Monday, May 6, 2024

చైనాలో భారీ అగ్నిప్రమాదం..

చైనాలోని ఓ భారీ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆ బిల్డింగ్ నుంచి ద‌ట్ట‌మైన పొగ కూడా వ‌స్తోంది. ఈ ప్ర‌మాదంలో ఎంత మంది గాయ‌ప‌డ్డారో ఇంకా తెలియ‌రాలేదు. ఛాంగ్సూలోని చైనా టెలికాం బిల్డింగ్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మంట‌ల్ని ఆర్పేందుకు అగ్ని మాప‌క సిబ్బంది శ్ర‌మిస్తోంది. హునాన్ ప్రావిన్సు రాజ‌ధాని ఛాంగ్సూ. ఈ న‌గ‌రంలో సుమారు 10 మిలియ‌న్ల జనాభా ఉంది. ప్ర‌మాదం త‌ర్వాత ట‌వ‌ర్ వ‌ద్ద భారీగా న‌ల్ల‌టి పొగ అలుముకున్న‌ది. ఆ బిల్డింగ్‌లో డ‌జ‌న్ల సంఖ్య‌లో ఉన్న ఫ్లోర్లు మంట‌ల్లో కాలిపోతున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement