Sunday, April 28, 2024

ఇటలీలోని మిలాన్‌లో భారీ పేలుడు..

ఇటలీలోని మిలాన్‌లో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. దీంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన అనంతరం పలు కార్లు మంటల్లో చిక్కకున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పార్క్‌ చేసిన వ్యాన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడ మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించింది. పేలుడు సంభవించిన తర్వాత అనేక వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయని.. ఒక వ్యక్తి గాయపడ్డారని అగ్నిమాపక దళం తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి మరణాలు సంభవించినట్టుగా ఇప్పటివరకు నివేదించబడలేదు. ఆక్సిజన్ గ్యాస్ డబ్బాలను రవాణా చేస్తున్న వ్యాన్‌లో పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నట్లు ఇటాలియన్ మీడియా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement