Monday, April 29, 2024

Breaking: జూబ్లీహిల్స్‌లో అగ్ని ప్ర‌మాదం.. మంట‌లార్పిన అగ్నిమాప‌క సిబ్బంది

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్​ లోని ఓ ప్రైవేట్‌ ఆఫీసులో ఇవ్వాల (మంగ‌ళ‌వారం) కొద్దిసేప‌టికి క్రితం ఫైర్​ యాక్సిడెంట్​ జరిగింది.. స‌మాచారం అందుకున్న వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి హుటాహుటిన అగ్నిమాప‌క సిబ్బంది త‌ర‌లివ‌చ్చారు. రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. నిన్న సికింద్రాబాద్​లో జరిగిన ఘటన మరువక ముందే సిటీలో మ‌రో ఘటన జరిగింది.. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

అగ్ని ప్రమాదంపై అప్​డేట్​ ఏంటంటే..

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఖాళీ భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఈ బిల్డింగ్​లో జూబ్లీ8 క్లబ్ కొనసాగింది. కొన్ని నెలలుగా ఆ భవనం ఖాళీగానే ఉంటోంది. బిల్డింగ్​ 3వ అంతస్తులో కొనసాగుతున్న (వెల్డింగ్) పనులకు సంబంధించిన నిప్పు రవ్వలు కింద ఫ్లోర్ లలోని స్టోర్ రూమ్ లో పాత సామగ్రి పై పడ్డాయి. దీంతో మంటలు అంటుకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సకాలంలో చేరుకొని 2 ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి తీసుకవచ్చారు. ఖాళీ భవనం కావడంతో ఆస్తి , ప్రాణ నష్టం జరగలేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement