Wednesday, April 24, 2024

గాడ్ ఫాద‌ర్ ‘థార్ మార్ థ‌క్క‌ర్ మార్’ ప్రోమో అదిరింది

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్టు గాడ్ ఫాద‌ర్‌. ఈ సినిమాకి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ స‌ల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అయితే.. తాజాగా ఓ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేక‌ర్స్. స‌ల్మాన్, చిరుపై వ‌చ్చే ఈ ఫ‌స్ట్ సింగిల్ ప్రోమోని ‘థార్ మార్ థ‌క్క‌ర్ మార్’ ను విడుద‌ల చేశారు. ప‌క్కా మాస్ బీట్‌లో సాగుతున్న ఈ పాట‌ను అనంత‌శ్రీరామ్ రాయ‌గా.. శ్రేయో ఘోష‌ల్ ఈ పాట‌ను ఆలపించింది. చిరు, స‌ల్మాన్ పై వ‌చ్చే ఈ సాంగ్‌కు ప్ర‌భుదేవా కొరియోగ్ర‌ఫీ చేశాడు. అయితే ఈ సాంగ్ ఫుల్ వ‌ర్షెన్ 15వ తేదీన రీలీజ్ కాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

కాగా, ఇప్ప‌టికే రిలీజైన గాడ్‌ఫాద‌ర్ టీజ‌ర్, న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు సినిమాపై మ‌రింత‌ అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ఇక ఈ మూవీని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేసేందుకు రెడీ అవుతున్నారు మేక‌ర్స్‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement