Sunday, May 5, 2024

700 మంది పోలీసులకు కరోనా: సీపీ అంజనీ

హైదరాబాద్ పోలీసులను కరోనా కలవరపెడుతోంది. కరోనా నివారణలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న పోలీసులు కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 700 మంది ఈ వైరస్ బారినపడ్డారు. 

తెలంగాణలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో పోలీసులు రెస్ట్ లేకుండా డ్యూటీ చేస్తున్నారు.ఈ క్రమంలో 700 మంది పోలుసులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ప్రజలను కాపాడే ప్రయత్నంలో వీరంతా కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. రోజురోజుకు పోలీసుశాఖలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. తప్పనిసరిగా పోలీసులు టీకా వేయించుకోవాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది 3800 పోలీసులకు కరోనా సోకింది. అందులో 41 మంది కరోనాతో మృతి చెందారు. సెకెండ్ వేవ్‌లో 700 మందికి పైగా పోలీసులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఇదిఇలా ఉంటే… తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు నమోదయ్యాయి. గిచిన 24 గంటల్లో 29 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 3.79 లక్షలు దాటింది. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 1,928 మరణాలు సంభవించాయి. తెలంగాణలో యాక్టివ్ కేసులు 52,726 కాగా.. కరోనా నుంచి 3.24 లక్షల మంది కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 1005 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement