Thursday, April 25, 2024

ఒంటరితనం భరించలేక పెళ్లిచేయాలని డిమాండ్

రాజస్థాన్‌లో విచిత్రం చోటు చేసుకుంది. ఇప్పటివరకు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యమకారులు, తమ ప్రేమను ఒప్పుకోవాలని ప్రేమికులు మాత్రమే కరెంట్ స్తంభాలు ఎక్కడం చూశాం. కానీ 60 ఏళ్ల వృద్ధుడు తనకు రెండో పెళ్లి చేయాలని కరెంట్ స్తంభం ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. ధోల్‌పూర్‌కి చెందిన 60 ఏళ్ల సోర్బన్ సింగ్ భార్య నాలుగేళ్ల క్రితం చనిపోయింది. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నా భార్య తోడు లేకపోవడంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. దీంతో తనకు రెండో పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లను అడిగాడు. ఈ వయసులో రెండో పెళ్లి ఏంటని కుటుంబ సభ్యులు మందలించడంతో పాటు రెండో పెళ్లి చేసేందుకు ససేమిరా అన్నారు. దీంతో సోర్బన్ బాగా హర్ట్ అయ్యాడు. కుటుంబసభ్యులపై అలక పూని కరెంట్ స్తంభం ఎక్కాడు.

తనకు ఒక తోడు కావాలని, ఎలాగైనా రెండో పెళ్లి చేయాలని.. అలా అయితేనే కరెంట్ స్తంభం దిగుతానని అల్టీమేటం జారీ చేశాడు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై వెంటనే విద్యుత్‌శాఖ సిబ్బందికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే స్పందించి ఆ వీధిలో విద్యుత్‌ నిలిపేశారు. ఊపిరి పీల్చుకున్న కుటుంబసభ్యులు సోర్బన్‌ను స్తంభం దిగాలని వేడుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్తంభం ఎక్కి సోర్బన్‌కు సర్ది చెప్పి కిందకి తీసుకొచ్చాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement