Thursday, April 25, 2024

500 థియేటర్లలో 50 రోజులు-ఆర్ ఆర్ ఆర్ రికార్డ్

ఈ రోజుల్లో 50రోజులు ఒకే చిత్రం థియేట‌ర్స్ లో ఆడ‌టం అంటే విశేష‌మే మ‌రి. ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ .ఈ చిత్రం మ‌రో రికార్డుని సృష్టించింది. 500థియేట‌ర్స్ లో 50రోజులు పూర్తి చేసుకుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్’ సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా 500 థియేటర్లలో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో 50 రోజులను పూర్తి చేసుకున్న సినిమా ఇదే. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. సినిమా విడుదలకి ముందే పాటలన్నీ కూడా జనంలోకి దూసుకుపోయాయి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపించారు. విజయేంద్ర ప్రసాద్ కథాకథనాలు .. రాజమౌళి ఆయా పాత్రలను మలచిన తీరు .. ఆయన టేకింగ్ .. ఎన్టీఆర్ – చరణ్ నటన .. అజయ్ దేవగణ్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. తొలి రోజునే రికార్డుస్థాయి వసూళ్లతో తన ఓపెనింగ్స్ ను మొదలుపెట్టిన ఈ సినిమా, 1000 కోట్ల మార్కును అందుకోకపోవడానికి ఎక్కువ సమయం తీసుకోకపోవడం విశేషం. ఈ చిత్రంపై ఎంతో మంది లెజండ‌రీస్ ప్ర‌శంస‌లు కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement