Thursday, April 25, 2024

RRR: 500 సెంటర్స్ లో 50 డేస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. కొమరం భీమ్ గా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించిన ఈ సినిమా రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ ల సునామీ సృష్టించింది. తాజాగా ఈ సినిమా 500 కేంద్రాల్లో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో  50 రోజులను పూర్తి చేసుకున్న సినిమా ఇదే విశేషం. తొలి రోజునే రికార్డుస్థాయి వసూళ్లతో ఓపెనింగ్స్ సాధించిన ఈ మూవీ.. రూ. 1000 కోట్లకుపై వసూళ్లు సాధించింది. వెయ్యి కోట్లు కొల్లగొట్టిన నాలుగు భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ చిత్రం మొదటి రోజు నుండి బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. KGF చాప్టర్ 2 నుండి గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ, ఈ చిత్రం విజయవంతంగా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ పాన్-ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 500 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. RRR టీమ్ ఈ వార్తలను ఇటీవల తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

కాగా, ఈ సినిమా మే 20 నుంచి OTTలో ప్రసారం కానుంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అలీ భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 రోజుల వసూళ్లు సాధిస్తుందో లేదో చూద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement