Thursday, May 23, 2024

కెమెరాకి చిక్కిన అతి పెద్ద పాము – వైర‌ల్ అవుతోన్న వీడియో

చిన్న‌పాముని చూస్తేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది..అటువంటిది 30అడుగుల పాటుని చూస్తే అమ్మో గుండె ఆగిపోవాల్సిందే. అలాంటి అతిపెద్ద పాము ఒక‌టి రోడ్డు దాటుతూ కెమెరాకి చిక్కింది. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఒడిశాలోని నబరంగపూర్‌ జిల్లాలో ఈ పాము కనిపించింది. అది 25 నుంచి 30 అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. కత్తిగూడ జవహర్ నవోదయ విద్యాలయ సమీపంలో రోడ్డు దాటుతుండగా స్థానికులు గుర్తించారు. పాము రోడ్డున ఆ చివరకు చేరుకున్నా దాని సగ భాగం ఇంకా ఇవతలివైపున ఉండడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ అతిపెద్ద సర్పాన్ని చూశాక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు హడలిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement