Monday, May 20, 2024

‘ఆత్మ‌’ని అమ్మ‌కానికి పెట్టిన విద్యార్థి – కొత్త ర‌కం బిజినెస్

హేగ్ ఆర్ట్ అకాడ‌మీలో 21ఏళ్ల విద్యార్థి స్టిన్ వాన్ షైక్ ఆత్మ‌లపై ఓ కోర్సుని చేస్తున్నాడు. ఈ విద్యార్థి నెద‌ర్లాండ్స్ కు చెందిన వాడు. అంతేకాదు తన ఆత్మను అమ్మకానికి పెట్టి సంచలనం సృష్టించాడు. అది కూడా తన ఆత్మను బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సహితమైన నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్ టీ) రూపంలో ఓపెన్ సీ ఆన్ లైన్ మార్కెట్లో అమ్మకానికి పెట్టాడు. తన ఆత్మను డిజిటల్ కళారూపంగా పేర్కొంటూ, ఎవరైనా కొనుగోలు చేయవచ్చని ఆఫర్ చేశాడు. హలో… నా ప్రొఫైల్ కు స్వాగతం. నా ఆత్మను ఇక్కడ అమ్మకానికి ఉంచాను. నా గురించి, నా ఆత్మ గురించి అడగడానికి ఎలాంటి సంకోచాలు వద్దు” అని వాన్ షైక్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. అంతేకాదు, తన ఆత్మను విక్రయించడం కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను ఏర్పాటు చేశాడు. ఆత్మను కొనుగోలు చేసినవారికి… ఆత్మను మొత్తంగానూ, లేక కొన్ని భాగాలుగానూ అందిస్తానని వాన్ షైక్ వెల్లడించాడు. ఎవరికైనా ఆత్మబలిదానం వంటి వాటిపై నమ్మకం ఉంటే తన ఆత్మను బలి ఇవ్వొచ్చని సూచిస్తున్నాడు. తన ఆత్మను ఎన్ఎఫ్ టీ రూపంలో అమ్మకానికి పెడుతున్నానని, బ్లాక్ చెయిన్ సాంకేతికత సాయంతో క్రిప్టో కరెన్సీ చెల్లింపుల ద్వారా కొనుగోలు చేయొచ్చని తెలిపాడు. కాగా, ఓపెన్ సీ ఎన్ఎఫ్ టీ మార్కెట్లో ప్రస్తుతం ఈ నెదర్లాండ్స్ విద్యార్థి ఆత్మకు 347 డాలర్ల వరకు బిడ్డింగ్ చేరుకుంది. అది ఇంకా పెరుగుతుందని ఆ విద్యార్థి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement