Saturday, May 11, 2024

Analysis: బీజేపీ అభ్యర్థుల్లో ఎక్కుమంది క్రిమినల్స్.. ఏడీఆర్ సర్వేలో వెల్లడి..

మణిపూర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది క్రిమినల్ లీడర్లు ఉన్నట్టు పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. నామినేషన్ పత్రాల్లో పొందుపరిచిన క్రిమినల్ కేసుల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) ఓ విశ్లేషణ చేసింది. దాని ప్రకారం మణిపూర్‌లోని రాజకీయ పార్టీలు డబ్బు బలం, నేర నేపథ్యం ఉన్న అభ్యర్థులను ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. క్రిమినల్ కేసులున్న అభ్యర్థులను బీజేపీ ఎక్కువమందిని నిలబెట్టగా.. ఆ తర్వాత స్థానంలో జేడీ(యూ) ఉంది.

మణిపూర్‌లో తొలి దశ ఎన్నికలకు పోటీలో ఉన్న 173 మంది అభ్యర్థుల్లో కనీసం 21శాతం మందిపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారు. వీరిలో 16శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. ఇద్దరు అభ్యర్థులు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ప్రకటించగా.. ఇంకో ఇద్దరు అభ్యర్థులు తమపై హత్య (IPC సెక్షన్-302) కేసులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మ‌రో ఆరుగురు అభ్యర్థులు మాత్రం తమపై హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్-307) కేసులున్నట్టు వెల్లడించారు. కాగా, మణిపూర్‌లో ఫిబ్రవరి 28, మార్చి 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మణిపూర్ తొలిదశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సగానికి పైగా కోటీశ్వరులేనని అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) పేర్కొంది. ప్రధాన పార్టీల్లో బీజేపీ నుంచి పోటీచేస్తున్న‌ 38 మంది అభ్యర్థుల్లో 11 (29%), జెడి(యు) నుంచి పోటీలో ఉన్న‌ 28మంది అభ్యర్థుల్లో 7 (25%), కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న‌ 35మంది అభ్యర్థుల్లో 8 (23%), NPP నుండి పోటీలో ఉన్న‌ 27మంది అభ్యర్థుల్లో (11%) మంది తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడించారు. 38 నియోజకవర్గాల్లో 8 రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉన్న అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు కలిగి ఉంటే.. ఆ నియోజకవర్గాలను రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా పేర్కొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement