Sunday, June 23, 2024

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. జాతరకు వెళ్లి వస్తుంటే లాక్కెళ్లి..

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఓ 17 ఏళ్ల గిరిజన బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. నిందితులు ఆమె ముఖాన్ని మొత్తం పళ్లతో కొరికేశారు.  ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  బాధితురాలు తన బంధువుతో కలిసి జాతర నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ముగ్గురు నిందితులు ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

బాధితురాలు తప్పించుకుని ఆదివారం అర్ధరాత్రి బంధువుల ఇంటికి చేరుకుంది. కాగా, సోమవారం ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన 22 ఏళ్ల వ్యక్తి, 16, 17 ఏళ్ల ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై సామూహిక అత్యాచారం, అపహరణ, గాయపరచడం..  బెదిరించడం వంటి కేసులతో పాటు పోక్సో కేసు నమోదు చేశారు.

బాలిక మెడికల్ రిపోర్టులో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యిందని పోలీసు అధికారి తెలిపారు. అయితే ముగ్గురు నిందితులు, బాధితురాలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, ఘటన తర్వాత బాలిక కుటుంబ సభ్యులు బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని నిందితుల్లో ఒకరిని  కోరగా అతడు ఒప్పుకోలేదు.  దీంతో  బాధితురాలి కుటుంబం పోలీసులకు కంప్లెయింట్​ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement