Monday, May 20, 2024

న‌గ్నంగా 15నిమిషాలు – పిశాచి2లో ఆండ్రియా సాహ‌సం

కొంత‌మంది హీరోయిన్స్ కెరీర్ కోసం ఎంత‌టి రిస్క్ అయినా తీసుకోవ‌డానికి వెనుకంజ వేయ‌రు. బోల్డ్ గా క‌నిపించే అవ‌కాశం వ‌స్తే.. ఏమాత్రం ఆలోచించ‌రు. గ్లామ‌ర్ కోసం స్కిన్ షో చేయ‌డం వేరు.. క‌థ డిమాండ్ చేస్తే… ఎంత‌టి క్లిష్ట‌మైన స‌న్నివేశంలో అయినా న‌టించ‌డానికి ఓకే చెప్ప‌డం వేరు. ఆండ్రియా ఇప్పుడు అదే చేస్తోంద‌ని చెస్తోంది. ఆండ్రియా ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం పిశాచి 2. మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇది హార‌ర్ సినిమా. గ‌తంలో వ‌చ్చిన పిశాచి 1కి సీక్వెల్. ఈ సినిమాలో క‌థ ప్ర‌కారం కొన్ని స‌న్నివేశాల్లో ఆండ్రియా న‌గ్నంగా క‌నిపిస్తుందిట. దానికి ఆండ్రియా ఒప్పుకుంద‌ని, దాదాపు 15 నిమిషాల పాటు.. ఆండ్రియా.. ఒంటిమీద బ‌ట్ల‌ల్లేకుండానే క‌నిపిస్తుంద‌ని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం నిజమే అని రీసెంట్ గా ఓ వెబ్ మీడియా కు ఇచ్చిన ఇంటర్వూలో రివీల్ చేసింది ఆండ్రియా. మొదట తాను ఇలాంటి పాత్ర చేయటానికి ఒప్పుకోలేదని..కానీ కథ విన్నాక ఖచ్చితంగా చెయ్యాల్సిన అవసరం ఉందనిపించిందని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ స‌న్నివేశాలు అస‌భ్యంగా, అభ్యంత‌ర‌క‌రంగా లేకుండా మిస్కిన్ జాగ్ర‌త్త ప‌డ్డార‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement