Monday, April 29, 2024

Omicron: తెలంగాణలో తగ్గేదే లే.. ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు విజృంభిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో కొత్తగా 12 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 55కు చేరింది. అయితే ఓమిక్రాన్ బారిన పడిన వారిలో 10 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో పెద్దగా లక్షణాలు ఏం ఉండటం లేదని తెలుస్తోంది.

తెలంగాణలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈనెల 30 నుంచి జవవరి 2 వరకు ఆంక్షలు కూడా విధించింది. న్యూ ఇయర్ వేడుకల్లో ప్రజలు గుమిగూడకుండా…సభలు, సమావేశాలు, ర్యాలీను నిషేధించింది.  విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలోనే ఒమిక్రాన్ ను గుర్తించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న 182 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 90 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 181 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,80,844కి చేరింది. ఇందులో 6,73,404 మంది బాధితులు ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,417 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 4,023 మంది బాధితులు మరణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement