Thursday, March 28, 2024

105 ఏళ్ల వ‌య‌స్సులో ప్ర‌పంచ‌రికార్డ్ సృష్టించిన బామ్మ‌..ఏం చేసిందో తెలుసా..

105ఏళ్ల వ‌య‌స్సులో ఏం చేస్తాం అంటే అదేం ప్ర‌శ్న‌..క‌ద‌లేని ప‌రిస్థితుల్లో మంచంపై ఉంటాం అనుకుంటారు క‌దా..కానీ ఆ మాట అవాస్త‌వం..క‌ద‌లేని వ‌య‌స్సులో ఏకంగా ప‌రుగులు తీసింది ఓ బామ్మ‌..ఎక్క‌డా అనుకుంటున్నారా.. అమెరికా దేశంలోని లూసియానా కు చెందిన‌ జూలియా హరికేన్స్‌ హాకిన్స్‌. 105 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఈ బామ్మ‌ ప్ర‌పంచ రికార్డు సృష్టించింది. 100 మీట‌ర్ల ప‌రుగును కేవ‌లం 102 సెక‌న్ల లో నే పూర్తి చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఈ బామ్మ పేరు చివ‌రిలో ఉన్న హ‌రికేన్ అనేది పేరు కాద‌ట‌.. అమె ప‌రుగును చూసి అభిమానులు ఇచ్చిన బిరుదు.

ఈ బామ్మ చాలా కాలం నుంచి రన్నింగ్ చేస్తుంద‌ట‌. అలాగే త‌న వ‌య‌స్సు 100 దాటిన ర‌న్నింగ్ ను విడిచి పెట్ట‌లేదు. అంతే కాకుండా ప్ర‌పంచం ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డు ల‌ను సృష్టిస్తుంది. అలాగే దీని పై స్పందించిన జూలియా హ‌రికేన్స్ హాకిన్స్ అనే బామ్మ.. ఇంకా ప‌రిగెత్తాల్సింది. నిమిషంలోనే పూర్తి చేస్తా అనుకున్నా.. అని చెప్పింది. ఇప్ప‌టి కే ఈ బామ్మ త‌న వ‌య‌స్సు కున్న తక్కువ స‌మ‌యంలోనే 100 మీట‌ర్ల ప‌రుగు ను పూర్తి చేసింది. ఈ బామ్మ‌ 80 ఏళ్ల వయసులో నేషనల్‌ సీనియర్‌ గేమ్స్‌సైక్లింగ్‌లో పోటీ పడింది. 2017లో ఈ బామ్మ‌ సైక్లింగ్‌ వదిలేసింది. దీని త‌ర్వాత రన్నింగ్‌ ఎంచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement