Sunday, April 28, 2024

గ‌ల్లాపెట్టె గ‌ల‌గ‌ల‌.. ఒక్క న‌వంబ‌ర్‌లోనే జీఎస్టీ ద్వారా కేంద్రానికి రూ.1.31 లక్షల కోట్ల ఆమ్దానీ..

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం మరో మైలురాయిని చేరుకుంది. నవంబరు నెలకు గానూ ఏకంగా రూ.1.31 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలు చేసినట్లు కేంద్రం తెలిపింది. 2017 జులైలో జీఎస్‌టీని అమల్లోకి తెచ్చిన తర్వాత ఇదే రెండో అత్యధిక ఆదాయం కావడం విశేషం. జీఎస్టీ వసూళ్లలో ఐదు నెలల నుంచి రూ.లక్ష కోట్లకు పైగా ఆదాయం జీఎస్టీ రూపంలో కేంద్రప్రభుత్వానికి వ‌స్తోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ ద్వారా నవంబరు నెలకు రూ. 1,31,526 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం తెలియజేసింది.

అందులో సెంట్రల్ జీఎస్టీ (CGST) రూ.23,978 కోట్లు కాగా.. రాష్ట్రాల నుంచి వచ్చిన జీఎస్టీ (SGST) రూ.31,127 కోట్లు వసూలయ్యాయి. వీటితో పాటు ఐజీఎస్టీ (సమ్మిళిత జీఎస్టీ) కింద రూ.66,815 కోట్లు, సెస్ రూపంలో రూ.9,606 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత గతేడాది నవంబరుతో పోలిస్తే.. ఈసారి నవంబరులో 25 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. 2019 నవంబరుతో పోలిస్తే.. జీఎస్టీ ఆదాయం 27 శాతం వృద్ధి చెందినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుందన్న దానికి ఇదే నిదర్శనమని స్పష్టం చేసింది.

ఆల్ టైమ్ రికార్డు వసూళ్లు
అక్టోబరు 2021లో జీఎస్‌టీ ద్వారా రూ.1,30,127 కోట్ల ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. 2021 ఏప్రిల్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు ఆల్‌టైం రికార్డును తాకాయి. ఆ నెల రూ.1.41 లక్షల కోట్లు వసూలయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement