Friday, May 3, 2024

వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు క్లోజ్

బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 15 నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో పాటు మార్చి 13న రెండో శనివారం, మార్చి 14న ఆదివారం సెలవు కావడంతో మార్చి 13 నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ వరుసగా 4 రోజుల పాటు బ్యాంకుల బ్రాంచీలు పనిచేయవు.

పండుగ సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండవ శనివారాలు, 4 ఆదివారాలతో కలిసి మొత్తం మార్చి నెలలో 11 రోజులపాటు బ్యాంకు శాఖలు పనిచేయవు. స్థానిక సెలవులతో కలిసి 11 రోజులు బ్యాంకు పనిచేయనందున ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు సూచించాయి. మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటించారు. మార్చి 22న బీహార్ దివస్, మార్చి 30న హోలి పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. కాగా వరుస సెలవుల వల్ల ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీల కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని బ్యాంకులు సూచించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement