Friday, May 17, 2024

నియమించిన బీజేపీ హైకమాండ్

ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్‌(56)ను బీజేపీ హైకమాండ్ నియమించింది. ప్రస్తుతం ఆయన పౌరి గర్వాల్ ఎంపీగా ఉన్నారు. గతంలో 2015-17 మధ్య కాలంలో ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా తీరత్ బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా ఛౌబట్టఖల్ ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ నిషాంక్, ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రి ధన్ సింగ్ రావత్‌ తదితరుల పేర్లను పరిశీలించిన అనంతరం సీఎం పదవిని తీరత్‌కు ఇవ్వాలని బీజేపీ పార్టీ నిర్ణయించింది. తీరత్ బుధవారం సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. కాగా హైకమాండ్ ఆదేశాలతో సీఎం పదవికి మంగళవారం నాడు త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయడం తెలిసిందే.

అయితే ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన తాను సీఎం అవుతానని అసలు ఊహించలేదరి తీరత్ సింగ్ రావత్ వ్యాఖ్యానించారు. తనపై అపార నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల అంచనాలు, ఆకాంక్షలకు తగ్గట్లు నడుచుకుంటానని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement