Tuesday, October 8, 2024

World Cup – అసీస్ కు ఇంత బ‌లుపా…. మిచెల్ మార్ష్ కండ‌కావ‌రం… విరుచుకుప‌డుతున్న నెటిజెన్స్

ఆహ్వ‌దాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియాతో జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. దాంతో ఆస్ట్రేలియా ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ను అందుకుంది. ప్రపంచకప్‌ 2023 ట్రోఫీ గెలిచిన ఆసీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో ట్రోఫీ పట్టుకుని సందడి చేశారు. ఒక్కొక్కరుగా ఫొటోస్ దిగుతూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ చేసిన ఓ పని క్రికెట్ అభిమానులను తీవ్ర ఆగ్ర‌హానికి గురి చేసింది.

అసీస్ బ్యాట‌ర్ మిచెల్ మార్ష్ సోఫాలో కూర్చుని.. ప్రపంచకప్ 2023 ట్రోఫీపై తన రెండు కాళ్లు పెట్టి ఫొటోలకు పోజులిచ్ఛాడు. ఆస్ట్రేలియా ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న కొన్ని గంటల తర్వాత ఈ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఈ ఫోటోను తొలుత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఆపై వైరల్ అయింది. ఇది చూసిన ఫాన్స్ అతడిపై మండిపడుతున్నారు. ప్రపంచకప్‌కు కాస్త గౌరవం ఇవ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మిచెల్ మార్ష్.. అంత బలుపు అనవసరం అంటూ ఇంకొందరు మండిపడుతున్నారు. క‌నీసం సీనియ‌ర్స్ మార్ష్ కు బుద్ది చెప్ప‌కుండా ఈ ఫోటోను ఏకంగా కెప్టెన్ క‌మిన్స్ పోస్ట్ చేయ‌డంతో ఆసీస్ కు ఇంత కండ‌కావ‌ర‌మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement