Sunday, May 19, 2024

విండీస్‌ క్లీన్‌స్వీప్‌.. 3-0తో సిరీస్‌ కైవసం..

అమ్‌స్టెల్వీన్‌: ఐసీసీ వన్డే సూపర్‌లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మూడు వన్డేలో 20పరుగుల తేడాతో వెస్టిండీస్‌ ఘనవిజయం సాధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను వెస్టిండీస్‌ కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ షాయీ హోప్‌(24) నిరాశపరిచినా, మరో ఓపెనర్‌ కేలీ మేయర్స్‌ (120), షమర్హ్‌ బ్రూక్స్‌ 101 నాటౌట్‌తో అద్భుతంగా రాణించారు. దీంతో వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది.

అనంతరం 309 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 49.5 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. మ్యాక్స్‌ డౌడ్‌ 89, విక్రమ్‌జిత్‌ సింగ్‌ 54, ముసా అహ్మద్‌ 42 పరుగులు చేశారు. వెస్టిండీస్‌ బౌలర్లు షెర్మూన్‌ లెవీస్‌ 3 వికెట్లు తీయగా, అకీల్‌ హొసీన్‌, హైడెన్‌ వాల్ష్‌ చెరో వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో వెస్టిండీస్‌ ఐసీసీ పురుషుల వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌లో 80 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా.. నెదర్లాండ్స్‌ 25 పాయింట్లతో ఆఖరి స్థానంలో నిలిచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement