Monday, May 6, 2024

అప్పుడు ఫుట్ బాల్ ప్లేయ‌ర్.. ఇప్పుడు డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్

ఒక‌ప్పుడు భార‌త్ త‌ర‌పున అంత‌ర్జాతీయ టోర్నీల్లో స‌త్తా చాటి దేశ కీర్తి ప‌తాకాన్ని రెప రెప‌లాడించింది బెంగాల్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ పౌలోమి.. ఇప్పుడు కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేస్తున్నారు. పౌలోమి ఫుడ్ డెలివ‌రీ చేస్తున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ క్లిప్‌లో పౌలోమి జొమాటో టీ ష‌ర్ట్ ధ‌రించి ఫుడ్ డెలివ‌రీ చేస్తూ క‌నిపించింది.ఈ వీడియోలో ఆమె త‌న దుస్ధితి గురించి చెప్పుకొచ్చింది. కోల్‌క‌తాలోని బెహ‌లా ప్రాంతానికి చెందిన పౌలోమి ప్ర‌స్తుతం చ‌రుచంద్ర కాలేజ్‌లో చ‌దువుతోంది. అండ‌ర్ 16 ఫుట్‌బాల్ టోర్నీల్లో భార‌త్ త‌ర‌పున పాల్గొంటూ తాను జ‌ర్మ‌నీ, బ్రిట‌న్‌, శ్రీలంక స‌హా ప‌లు దేశాల్లో ప‌ర్య‌టించాన‌ని తెలిపింది. ఆపై త‌న క‌ల‌ల‌ను నెర‌వేర్చుకోలేక కుటుంబాన్ని పోషించుకునేందుకు ఫుడ్ డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్‌గా మారిన‌ట్టు వెల్ల‌డించింది. తాను రోజంతా క‌ష్ట‌ప‌డితే ఖ‌ర్చులు పోను కేవ‌లం రూ.300 నుంచి రూ .400 మిగులుతాయ‌ని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement