Tuesday, September 19, 2023

India Corona : అదుపులోనే కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు వ‌చ్చాయంటే..?

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ.. త‌గ్గుతూ వ‌స్తున్నాయి.. ప్రస్తుతం క‌రోనా అదుపులోనే ఉన్న‌ట్లు వైద్యులు పేర్కొంటున్నారు. చైనాలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేసిన త‌రుణంలో భార‌త్ లో కూడా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని వైద్యులు భావించారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసులు అదుపులోనే ఉంద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. గ‌డిచిన 24 గంటల్లో 1,94,968 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు.. ఇందులో 174 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,757కి చేర‌గా.. ప్రస్తుతం దేశంలో 2,257 కేసులు పాజిటివ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో ఒకరు, కేరళలో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,725కి చేరింద‌ని కేంద్ర వైద్య‌శాఖ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement