Friday, April 26, 2024

యూఏఈలోనే టీ20 ప్రపంచకప్‌…?

కరోనా వైరస్ భారత్ లో అన్ని రంగాలపై పడుతోంది. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతున్న.. మూడో వేవ్ రూపంలో ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అక్టోబర్ లో జరిగే టీ 20 ప్రపంచకప్ నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్యంపై నిర్ణయం ప్రకటించేందుకు బీసీసీఐకి నాలుగు వారాల సమయమిచ్చినా ఐసీసీ భారత్ లో టోర్నీ నిర్వహించకపోతే.. యూఏఈనే వేదికని చెప్పిందట. బీసీసీఐ కూడా దానికి అంగీకరించినట్టు సమాచారం.

అయితే యూఏఈలో టోర్నీ నిర్వహిస్తే అబుదాబి, షార్జా, దుబాయ్‌ వేదికలే కాకుండా.. నాల్గవ వేదికగా మస్కట్‌ను కూడా ఆ జాబితాలో చేర్చనున్నారట. అయితే ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచులను యూఏఈలోనే గత ఏడాది జరిగిన మూడు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ చేసింది. ఐపీఎల్ అనంతరం ప్రపంచకప్‌ కోసం పిచ్‌లు సిద్ధం చేసేందుకు తక్కువ సమయం ఉంటుంది. అదే సమయంలో మొదటి వారం మ్యాచులను కొత్తగా తెచ్చిన మస్కట్‌ లో నిర్వహిస్తే పిచ్ లను సిద్ధం చేయడానికి మరింత సమయం దొరుకుతుంది అని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement