Monday, May 6, 2024

Sviatek : వేల్స్ ఫైన‌ల్‌కు స్వియాటెక్

టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ఇండియ‌న్ వెల్స్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. ఏక‌ప‌క్షంగా సాగిన‌ సెమీఫైన‌ల్లో ఉక్రెయిన్ స్టార్ మ‌ర్టా క‌స్త్యుక్ ను చిత్తుగా ఓడించింది. వ‌రుస సెట్ల‌లో జోరు చూపించిన స్వియాటెక్ 6-2, 6-1తో మ‌ర్టాను మ‌ట్టిక‌రిపించింది.

దాంతో, రెండోసారి ఇండియ‌న్ వెల్స్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. మొత్తంగా ఈ పోలాండ్ స్టార్‌కు ఇది ప‌దో డ‌బ్ల్యూటీఏ ఫైన‌ల్ కావ‌డం విశేషం. టైటిల్ పోరులో ఆమె అమెరికా సంచ‌ల‌నం కొకో గాఫ్ , మ‌రియా స‌క్కారీ మ్యాజ్ విజేత‌తో అమీతుమీ తేల్చుకోనుంది. స్వియాటెక్ 2022లో తొలిసారి ఇండియ‌న్ వెల్స్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement