Thursday, April 25, 2024

కోల్​కతాతో సన్​రైజర్స్​ పోరు.. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న శ్రేయస్​​

మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వేదికగా జ‌ర‌గ‌నున్న ఇవ్వాల్టి మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైంది కోల్‌కతా నైట్ రైడర్స్. టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. టీమ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ మాట్లాడుతూ.. తమ జట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. ప్యాట్ కమిన్స్ స్థానంలో ఉమేష్ యాదవ్, షెల్డాన్ జాక్సన్ స్థానంలో శామ్ బిల్లింగ్స్ ఆడుతున్నట్లు తెలిపాడు. సన్‌రైజర్స్ టీమ్ లో కూడా మూడు మార్పులు చేసినట్లు కెప్ట‌న్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. నటరాజన్, వాషింగ్టన్ సుందర్‌ ఆడుతున్నారని, అలాగే ఫరూకీ స్థానంలో మార్కో జాన్సెన్ ఆడుతున్నాడని వెల్ల‌డించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement