Tuesday, April 23, 2024

Teaser : వారియ‌ర్ వ‌స్తున్నాడు.. పోలీసు ఆఫీస‌ర్ లుక్‌లో రామ్‌

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డైరెక్ట‌ర్ లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ది వారియర్’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రామ్ ఊరమాస్ పోలీస్ ఆఫీసర్ గా దుమ్ములేపుతున్నాడు. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, సాంగ్స్ కూడా సినిమాలో బోలెడంత మాస్ కంటెంట్ ను ఉన్నట్టు చూపిస్తున్నాయి. మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ సింగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా రేపు రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా తాజాగా టీజర్ ను వదిలారు మూవీ టీమ్. టీజర్ ఫుల్ ఆఫ్ మాస్ కంటెంట్ తో నిండిపోయింది.

రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ లుక్ లో అదిరిపోయాడు. సరికొత్త లుక్ లో డిఫరెంట్ మ్యానరిజాన్ని చూపిస్తున్నారు రామ్. హీరోయిన్ కృతి శెట్టి రామ్ కు దీటుగా కనిపిస్తోంది. సినిమాలో వీరిద్దరి రొమాన్స్ నెక్ట్స్ లెవల్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక విలన్ పాత్రలో ఆదిపినిశెట్టి అదరగొట్టాడు. రామ్ పోతినేని, ఆది మధ్య వార్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కనిపిస్తోంది. ‘పాన్ ఇండియా సినిమా చూసి ఉంటారు.. పాన్ ఇండియా రౌడీని చూశారా.. మై డియర్ గ్యాంగ్ స్టార్స్ వీలైతే మారిపోండి.. లేదంటే పారిపోండి ఇదేనేను మీకిచ్చే ఫైనల్ వార్నింగ్’ అంటూ రామ్ పోతినేని చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన‌ బీజీఎం కూడా నెక్ట్స్ లెవెల్ ఉంది. టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రామ్ పోతినేని మాస్ విజువల్స్ భారీ అంచనాలను నెలకొల్పేలా ఉన్నాయి. జులై 14న వరల్డ్ వైడ్ ‘ది వారియర్’ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement