Sunday, April 28, 2024

రాహుల్ సెంచరీపై సునీల్‌ శెట్టి కామెంట్..

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. కాగా రాహుల్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక రాహుల్ ప్రేయసి అతియా శెట్టితో పాటు ఆమె తండ్రి, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కూడా రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారి జాబితాలో ఉన్నారు. కంగ్రాట్స్ బాబా క్రికెట్ మక్కాలో సెంచరీ కొట్టావ్ అంటూ సునీల్ శెట్టి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. 248 బంతుల్లో 127; 12 ఫోర్లు, సిక్స్‌తో అదరగొట్టాడు రాహుల్. క్రికెట్‌ మక్కాగా పేరొందిన ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన మూడో భారత ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

ఇది కూడా చదవండి: వాట్సప్ గ్రూప్ లో పోర్న్ వీడియో కలకలం..షాక్ అయిన మహిళలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement