Thursday, April 25, 2024

మహేష్ సినిమాకు పూజ హెగ్డే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అదే పూజా హెగ్డే రెమ్యునరేషన్. ఈ సినిమాకి ఏకంగా 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను తీసుకుంటుందట పూజా హెగ్డే. గతంలో పూజా హెగ్డే త్రివిక్రమ్ తో అరవింద సమేత, అలవైకుంటాపురములో నటించిన సంగతి తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement