Saturday, May 4, 2024

Delhi Capitals | హ్యారీ బ్రూక్ స్థానంలో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్‌…

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు దూరమైన హ్యారీ బ్రూక్ స్థానంలో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్‌ లిజాద్ విలియమ్స్‌ను జ‌ట్టులోకి తీసుకుంటున్న‌ట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ ప్ర‌క‌టించింది. కనీస ధర రూ.50 లక్షలతో సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా తరఫున విలియమ్స్ రెండు టెస్టులు, నాలుగు వన్డేలు, 11 టీ20లు ఆడాడు. 24 వికెట్లు పడగొట్టాడు.

కాగా, ఇటీవల జరిగిన వేలంలో హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లుకు కొనుగోలు చేసింది. భారీ హిట్టర్ అయిన బ్రూక్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని భారీ మొత్తాన్ని వెచ్చించింది. కానీ తన నాన్నమ్మ మరణించడంతో బ్రూక్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. కుటుంబంతో సమయాన్ని గడపాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జే రిచర్డ్సన్, అన్రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, కుమార్ కుషాగ్రా, యశ్ ధుల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, సుమిత్ కుమార్, ప్రవీణ్ దూబే, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, రికీ భుయ్, షై హోప్, విక్కీ, రసిక్ దార్ సలామ్, స్వస్తిక్, మిచెల్ మార్ష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement