Tuesday, April 30, 2024

Soapbox Race … మ‌రో అంతర్జాతీయ రేస్ కు వేదిక‌గా భాగ్య‌న‌గ‌రం

హైదరాబాద్‌: అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉన్న ‘సోప్‌బాక్స్‌’ రేసులకు భాగ్యనగరం వేదిక కానుంది. వచ్చే ఏడాది మార్చిలో ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ సంస్థ రెడ్‌బుల్‌ ప్రకటించింది. నాన్‌ మోటరైజ్డ్‌ వాహనాల పోటీలతో ప్రేక్షకులకు వినోదం పంచడం దీని ఉద్దేశం. బ్రెజిల్‌లోని బ్రస్సెల్స్‌లో ఈ పోటీలను మొదటిసారి నిర్వహించగా .ఇప్పటి వరకు 52 దేశాలు, 95 నగరాలకు ఇది విస్తరించింది. 2012, 2016లో ముంబయి వేదికగా పోటీలు జరగగా ఎనిమిదేళ్ల తర్వాత భారత్‌లో, హైదరాబాద్‌ నగరంలో తొలిసారిగా ఈ పోటీలు జరగనున్నాయి.

ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారికి ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం పలుకుతోంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. : ఈ పోటీల్లో పాల్గొనేవారు చిన్న పరిమాణంలో నాన్‌ మోటరైజ్డ్‌ వాహనాలను రూపొందించుకోవాలి. ఆ వాహనాలకు బ్రేకింగ్‌ వ్యవస్థతో పాటు స్టీరింగ్‌ పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. వాహన తయారీలో వైవిధ్యం, సృజనాత్మకత కనిపించాలి. https://www.redbull.com/inen/events/red-bullsoapboxrace-india-2024 వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా వివరాలు నమోదు చేయాలి. అనంతరం వాహనానికి సంబంధించిన స్కెచ్‌, థీమ్‌ తదితర వివరాలను అప్‌లోడ్‌ చేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement