Sunday, May 5, 2024

సిరాజ్ కు గాయం – వ‌న్డే సిరీస్ నుంచి ఔట్ ..

వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‌ గెలిచి జోరు మీదున్న భారత జట్టు వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది..పేస‌ర్ సిరాజ్ కు చీల‌మండలంలో గాయం కావ‌డంతో అత‌డిని సిరీస్ నుంచి త‌ప్పించారు. ప్రాక్టీస్ తర్వాత చీలమండలో నొప్పి వచ్చినట్టు సిరాజ్‌ తెలిపాడు. సిరాజ్‌ను పరీక్షించిన బీసీసీఐ వైద్య బృందం ముందు జాగ్రత్తగా విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. దాంతో, ఈ సిరీస్‌ నుంచి అతను తప్పుకోవాల్సి వచ్చింది. బుమ్రా, షమీ అందుబాటులో లేకపోవడంతో భారత పేస్ బృందాన్ని సిరాజ్‌ నడిపిస్తున్నాడు. అతను దూరం కావడం వన్డే సిరీస్‌లో భారత్‌కు కచ్చితంగా లోటు కానుంది. ఇక వ‌న్డే సిరీస్ మ‌రికొద్దిసేప‌టిలో ప్రారంభ‌కానుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement