Thursday, May 2, 2024

Sehwag: ఇంకా ఆ ఖ‌ర్మ ప‌ట్టలేదు..

విదేశీ టీ20 లీగ్‌ల్లో ఆడేంత కర్మ భారత ఆటగాళ్లకు పట్టలేదని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. భారత ఆటగాళ్లకు కావాల్సిన డబ్బు స్వదేశీ టోర్నీలతోనే వస్తుందని తెలిపాడు. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో ఓ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడిన సెహ్వాగ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

- Advertisement -

భవిష్యత్తులో భారత ఆటగాళ్లు ఐపీఎల్ కాకుండా ఇతర టీ20 లీగ్‌ల్లో ఆడే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సెహ్వాగ్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ‘భారత ఆటగాళ్లకు వీదేశీ క్రికెట్ లీగ్స్ ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేం చాలా సంపన్నులం. పేద దేశాలకు వెళ్లి ఆడాల్సిన కర్మ మాకు పట్టలేదు(నవ్వుతూ). భారత జట్టులో చోటు కోల్పోయినప్పుడు నాకు బిగ్ బాష్ లీగ్‌లో ఆడమని ఓ ఫ్రాంచైజీ నుంచి ఆఫర్ వచ్చింది.

నేను ఎన్ని డబ్బులు ఇస్తారని అడిగాను. అందుకు వారి ఇచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయాను. వారు నాకు రూ. 84 లక్షలు ఇస్తామని చెప్పారు. వెంటనే నేను నవ్వుకొని అంతకంటే ఎక్కువ డబ్బులను నా హాలిడే ట్రిప్స్‌లో ఖర్చు చేస్తానని చెప్పాను. గత రాత్రి పార్టీ బిల్లు కూడా రూ. 84 లక్షలు ధాటిందని సమాధానం ఇచ్చాను. నేను కాదు భారత క్రికెటర్లందరిది ఇదే పరిస్థితి.’అని సెహ్వాగ్ తెలిపాడు. ఐపీఎల్‌ ద్వారానే భారత ఆటగాళ్లు కోట్ల రూపాయాలు ఆర్జిస్తున్నారు. ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు కోట్లలో వార్షిక వేతనం అందడంతో పాటు మ్యాచ్ ఫీజుల ద్వారా కూడా చాలా డబ్బు దక్కుతుంది. ఇవే కాకుండా ప్రముఖ కంపెనీల ఒప్పందాల ద్వారా భారత ఆటగాళ్లకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కొందరు ఆటగాళ్లు అయితే చాలా కంపెనీల్లో పెట్టు బడులు పెట్టారు.
భారత క్రికెట్‌లో భాగమైన ఆటగాళ్లు వీదేశీ టీ20 లీగ్స్ ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. ఒకవేళ ఎవరైనా ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడాలనుకుంటే భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలి. దేశవాళీ, అంతర్జాతీయ, ఐపీఎల్ టోర్నీలతో భారత ఆటగాళ్లు తీరిక లేని క్రికెట్ ఆడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement