Thursday, March 28, 2024

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌లో సవీటికి స్వర్ణం

ఢిల్లీ –  మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మరో భారత బాక్సర్‌ బూర సవీటి తన పంచ్‌ పవర్‌ చూపించింది. మహిళల 81 కిలోల విభాగం ఫైనల్లో సవీటి.. చైనా బాక్సర్‌ వాంగ్‌ లినాపై 4-3 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇద్దరి మధ్య హోరాహోరి పోరు జరిగింది. ఆఖరికి స్వల్ప తేడాతో సవీటి గెలుపొంది గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుంది.2023 మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది రెండో గోల్డ్‌ మెడల్‌. ఇవాళ సాయంత్రం 48 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్‌ నీతూ గంగాస్‌ మంగోలియన్‌ బాక్సర్‌ను 5-0 తేడాతో మట్టి కరిపించి 🪙 గోల్డ్ మెడల్ సాధించింది.. మరో బంగారు పతకం కోసం రేపు తెలంగాణ బాక్సర్ నిఖత్‌ జరీన్‌ ఫైనల్ పోరు మ్యాచ్ లో తలపడనుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement