Wednesday, April 17, 2024

IND-ENG TEST | సర్ఫరాజ్‌కు క్లాస్ పీకిన రోహిత్.. వీడియో వైరల్ !

రాంచీలో టీమిండియా–ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా సర్ఫరాజ్ ఖాన్ షార్ట్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ షోయబ్ బషీర్ బ్యాటింగ్ చేస్తుండగా.. అతనికి సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ హెల్మెట్ ధరించకపోవడాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ గమనించాడు.

వెంటనే బౌలింగ్ ఆపమని చెప్పి, సర్ఫరాజ్‌ని ఉద్దేశిస్తూ ‘హే హీరో నై బన్నె కా’ అంటూ తనదైన శైలిలో హెల్మెట్ ధరించమని చెప్పాడు. సర్ఫరాజ్ వెంటనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి హెల్మెట్ తెచ్చి పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement